Breaking News

నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను తనిఖీ చేసి అక్కడ ఫిల్టర్ బెడ్లు క్లారిఫైయర్లు శుభ్రం చేస్తున్న బురద నీటిని శుభ్రం చేస్తున్న క్లారిఫైయర్లను పరిశీలించారు. రెండు హై స్పీడ్ సబ్మెర్సిబుల్ శివేజ్ పంపు లను విజయవాడ నుండి కొనుగోలు చేసి తెప్పించామని వాటి ద్వారా బురదను తొలగించే ఏర్పాట్లు చేశామని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు జిల్లా కలెక్టర్కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సోమవారం నగరంలోని భాస్కరపురం రాజుపేట గొడుగుపేట హౌసింగ్ కాలనీ లలోని ప్రజలు నగరంలో సరఫరా చేస్తున్న మంచినీటి లో మంచినీరు ధర్మ దుర్వాసన వస్తుందని రంగు మారిపోయిందని ఫిర్యాదు చేశారన్నారు ఆ వెంటనే నీటి ట్రీట్మెంట్ ప్లాంటును ఆడిట్ చేయించామని క్లారిఫై లొకేటర్ లో బురద ఉన్నట్లు కనపడిందని దానిని మొత్తం బయటకు తీసే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు వచ్చే మూడు నాలుగు రోజుల్లో గా ఆ పనులు పూర్తవుతాయన్నారు నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన మంచినీటిని సహస్ర సరఫరా చేసేందుకు నగరపాలక సంస్థ జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు.

అంతకుమునుపు బైపాస్ రోడ్డు లో ఎస్ఎన్ గొల్లపల్లి- చల్లపల్లి మార్గంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు నగరం నుండి 84 టన్నుల చెత్తను సేకరించి రెండు కాంపాక్టర్ల ద్వారా 18 టన్నుల చెత్తను గుంటూరు జిల్లాలోని కొండవీడు లో ఉన్న జిందాల్ పవర్ ప్లాంట్ కు పంపించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్కు వివరించారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అసలు రోజుకు అంత చెత్త వస్తుందా మరలా ఒకసారి రోజువారి ఎంత చెత్త వస్తుందో సరిగా పరిశీలించి వివరాలు అందజేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి హామీ మేరకు చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాల్సి ఉందని మొత్తం చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు మరమ్మతులు చేయక మూలనబడి ఉన్న ఇంకొక కాంపాక్టర్కు వెంటనే మరమ్మతులు చేయించి దాని ద్వారా మరో 9 టన్నుల చెత్తను గుంటూరు జిల్లాకు పంపించాలన్నారు. అదనంగా మరో కొత్త కాంపాక్టర్ ను కూడా కొనుగోలు చేసి దాని ద్వారా కూడా మరో 9 టన్నుల చెత్తను గుంటూరు జిల్లాకు పంపించి నగరంలో చెత్త లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ కు సూచించారు. కొత్తగా డంపింగ్ యార్డ్ కోసం కృష్ణ విశ్వవిద్యాలయంకు రెండు కిలోమీటర్ల దూరంలో కేటాయించిన 13.40 ఎకరాల స్థలాన్ని వినియోగంలోకి తేవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

ఈ తనిఖీలో కలెక్టర్ వెంట మునిసిపల్ ఇంజనీరు చంద్రశేఖర్, డి ఈ కుబియా నాయక్, ఏఈ తేజశ్రీ, పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *