Breaking News

సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ నిషేధంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడకం నిషేధంపై ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించగా, మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో ప్రజా ఆరోగ్య శాఖ ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నిషేదించాలని, 120 మైక్రోన్ల లోపు ఉన్న క్యారీ బ్యాగులు ఎక్కడున్నా, ఎవరు వినియోగించినా, ఏ షాపులో అమ్ముతున్న చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో వ్యర్థ నిర్వాహణలో ఎటువంటి అలసత్వం వహించరాదని, నగరాన్ని పారిశుధ్య నిర్వహణలో మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించాలని, నగరాన్ని సుందరంగా ఉంచేందుకు చెత్త సేకరణ ప్రతిరోజు జరగాలని, అందుకు కావాల్సిన వాహనాలు ఉపయోగపడేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పీ సత్య కుమారి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామ కోటేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, సానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, కళ్యాణం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రిని పురస్కరించుకొని 26.02.2025 బుధవారం రాత్రి మల్లేశ్వర స్వామి వారి ఆలయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *