Breaking News

గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  గంధం సునీత ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ వున్న వసతులను, వారికి అందిస్తున్న ఆహారాన్ని, సదుపాయాలను పరిశీలించిన తరువాత వయోవృద్దులతో మాట్లాడి వారి యోగా క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సదుపాయాలలో ఏదైనా అసంతృప్తి ఉంటే తెలియజేయాలని అన్నారు. వేళకు భోజనం చేస్తూ మందులు వేసుకోవాలని వృద్ధులకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *