Breaking News

అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లలో గ్రీనరీ, పరిశుభ్రత ఉండేలా అక్షయ పాత్ర, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. మంగళవారం చుట్టగుంట దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ఫ్లోరింగ్ మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. చుట్టగుంట దగ్గరలోని క్యాంటీన్ వద్ద ఫ్లోరింగ్ పనులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. పరిసరాల్లో ఉన్న భవన నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. ప్రజలు క్యాంటీన్ లో అందే ఆహారంపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియ చేయవచ్చన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *