Breaking News

ప్రతి అర్జీ ప్రధానమైనదే: కమిషనర్ కేతన్ గార్గ్

-ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 29 అర్జీలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీ ప్రధానమైనదేనని.. వాటిని తక్షణం పరిష్కరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా.. మొత్తం 29 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకి సంబంధించి 4 అర్జీలు రాగా పారిశుద్ధ్యానికి సంబంధించి 1, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 5, ఇంజనీరింగ్ కి సంబంధించి 8, వార్డు సచివాలయాలకు సంబంధించి 8, మెప్మాకు సంబంధించి ఒకటి ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా అర్జీదారుల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. సోమవారం వచ్చిన అర్జీలు శనివారం నాటికల్లా క్లోజ్ అయ్యేలా.. ఆయా విభాగాల హెచ్ఓడీలు చొరవ చూపాలన్నారు. కొన్ని సందర్భాలలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలపై పరిశీలన చేయాల్సి ఉంటుందని.. కనుక వినతులపై అర్జీదారునికి కచ్చితంగా సరైన సమాధానం అందాలని సూచించారు. అలాగే ఫిర్యాదుదారు ఇచ్చిన ప్రతి అర్జీని ఆన్ లైన్ లో నమోదుచేసి.. ఎన్ని రోజుల్లో పరిష్కరించేది రసీదు ఇస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అనంతరం పెండింగ్ గ్రీవెన్స్ పై ఆరా తీశారు. గతంలో వచ్చిన కొన్ని అర్జీలు ఇప్పటికీ క్లియర్ కాకపోవడానికి గల కారణాలను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా సచివాలయ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఒక అర్జీదారుని నుంచి వచ్చిన అప్లికేషన్ ఏస్థాయిలోనూ పెండింగ్ ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు.

కొన్ని అర్జీలు
• నాయిబ్రాహ్మణ కులవృత్తి అయిన కేశఖండన (తలనీలాల)కోసం పిండాలరేవుతో సహా పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులో షెడ్లు ఏర్పాటు చేయాలని.. నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ యానపు యేసు అర్జీ అందజేశారు.

• A.V.A. రోడ్డు మరమ్మతు పనులలో భాగంగా చేసిన తవ్వకాలతో త్రాగునీటి పైపు లైన్ పగిలి.. అందులో మురికి నీరు కలుస్తోందని శ్రీనివాస నగర్ కాలనీ వాసులు కమిషనర్ దృష్టికి వచ్చారు. తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.

• తన ఆధార్ నెంబర్ 19 ఇళ్ల అసెస్ మెంట్లకు లింక్ అయిందని.. వాటిని తొలగించాలని ఎన్నిసార్లు విన్నవించినా అధికారుల నుంచి సరైన స్పందన ఉండటం లేదని అన్నపూర్ణమ్మ పేటకు చెందిన వి.ఉమా పార్వతి రమాదేవి అర్జీ అందజేశారు.

• వి.ఎల్.పురం రోడ్డు ఆల్ బ్యాంక్ కాలనీ దాటిన తర్వాత పాతపిడింగొయ్యి R.S.నెం.395/2 లేఅవుట్ ప్లాట్ నెంబర్ 4 లో కొంతభాగం ఆక్రమణకు గురైందని.. చర్యలు తీసుకోవలసిందిగా ప్రకాశం నగర్ కు చెందిన పోతిరెడ్డి కళ్యాణి కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *