గుంటూరు, 1నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని వైద్యసేవలపై రోగుల సంతృప్తి స్థాయిని మరింత మెరుగ్గా పెంచేలా అవసరమైన అన్ని చర్యలు పటిష్ట ప్రణాళికం తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృధ్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
శనివారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని నాట్కో సెంటరు సెమినార్ హాలులో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ, శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులతో కలసి పాల్గొన్నారు. సమావేశంలో అజెండా అంశాలపై జరిగిన చర్చపై కేంద్ర గ్రామీణాభివృధ్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ శంకరవిలాస్ ఆర్వోబీ రహదారి విస్తరణలో భాగంగా ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్, ఇతర గదులను పక్కకు మార్చేందుకు నగరపాలక సంస్థ, విధ్యుత్ శాఖ అధికారలను సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలన్నారు. తులసి రామచంద్రప్రభు ఆర్ధిక సహాయంతో నిర్మించనున్న సర్వీస్ బ్లాక్ పనులు వెంటనే ప్రారంభించేలా ఇంజనీరింగ్ అధికారులు తుది ప్లానులో మార్పులు లేకుండా మరోసారి నిర్మాణ ఏజెన్సీతో కలిసి పరిశీలించాలన్నారు. పొదిలి ప్రసాద్ అత్యవసర విభాగంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో వరద నీరు చేరకుండా నిపుణుల సలహాలు తీసుకొని అవసరమైన పనులు వెంటనే చేపట్టాలన్నారు. జీజీహెచ్ లో ఈ-ఆఫీస్ అమలుకు అవసరమైన కంప్యూటర్లు సాఫ్ట్ వేర్ కంపెనీల సహకారంతో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులలో ప్రైవేటు వ్యక్తులు అన్నదానాలు చేయటం వలన పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నందున, ప్రస్తుతం అసుపత్రిలో మధురాన్నం ట్రస్ట్ ద్వారా జరుగుతున్న అన్నదానం మినహా మిగిలిన వారు అన్నదానం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. దాతలు అంతగా సహాయం చేయాలంటే ఆస్పత్రికి అవసరమైన ఇతర పరికరాలకు నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో సీసీటీవీ కెమేరాల ద్వారా నిరంతరం పటిష్టంగా పర్యవేక్షణ చేయటంతో పాటు పారిశుధ్ద్యం లోపం, ఇతర సంఘటనపై బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునే విధానంను అమలు చేయాలన్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించటంతో పాటు, నిర్లక్ష్యం లేకుండా వైద్యసేవలు అందించేలా పర్యవేక్షించాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నాట్కో క్యాన్సర్ సెంటరులో ప్రస్తుతం ఉన్న 120 పడకలతో పాటు అదనంగా మరో 150 పడకలకు విస్తరిస్తున్నందున ప్రభుత్వం కాన్సర్ చికిత్స లెవల్ 1 ఆసుపత్రిగా గుర్తించిందన్నారు. అదే విధంగా నాట్కో కాన్సర్ సెంటరులో మరో 30 రోజుల్లో పెట్ స్కాన్ ను ప్రారంభించనున్నందున దీనికి అవసరమైన సాంకేతిక సిబ్బందిని నియమించుకోవటానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్డియాలజీ విభాగంలో ఈసీజీ, ఓసీటీ మిషను ఏర్పాటుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులను సంప్రదించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లో జరగుతన్న అవకతవకలు, మార్చురీ వద్ద రోగుల నుంచి నగదు వసూలుపై వార్త పత్రికల్లో వచ్చిన కధనాలపై పూర్తి స్థాయిలో విచారించి ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని పిర్యాదుల పెట్టేలను మూడో పార్టీ సమక్షంలో తెరిపించి అందులో వచ్చిన అర్జీలపై తీసుకున్న చర్యల వివరాలను తదుపరి జరిగే అభివృద్ధి కమిటీ సమావేశంలో తెలియచేయాలన్నారు. ఆసుపత్రిలో వైద్యసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు ఆభివృధ్ది కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందించాలన్నారు.
సమావేశంలో సర్వీస్ బ్లాక్ ను రూ.10 కోట్లుతో నిర్మించనున్న తులసీ రామచంద్ర ప్రభు కు ఎంఓయు పత్రాలను కేంద్ర గ్రామీణాభివృధ్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ, శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులతో కలసి అందించి, ఆసుపత్రి తరుపున ఘనంగా సన్మానించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. యశస్వీ రమణ ప్రచురించిన జీజీహెచ్ సుఖీ భవ సమాచార దర్శిని పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృధ్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. . దీనిలో భాగంగా ప్రతి నెల అసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రికి అవసరమైన ఎసీలు సమకూర్చటం, రహదారి విస్తరణ వలన తొలగించిన నిర్మాణాలు పున:ర్ నిర్మించటం, పొదిలి ప్రసాద్ బ్లాక్ లో అత్యవసర మరమ్మత్తు పనులపై చర్చించటం జరిగిందన్నారు. ఈ-హస్పటల్ కు సంబంధించి అవసరమైన కంప్యూటర్లు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాట్కో కాన్సర్
సెంటరులో అదనంగా 150 బెడ్లు తో విస్తరించటంతో పాటు క్యాన్సర్ చికిత్స లెవెల్ వన్ హాస్పిటల్ గా అభివృద్ధి చెందుతుందని, పెట్ స్కాన్ ను త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన ఉద్యోగులు నియమకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తులసీ సీడ్స్ అదినేత, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తులసి రామచంద్ర ప్రభు నిర్మించనున్న సర్వీసు బ్లాక్ కు కూడా త్వరలో శంస్థాపన చేయబోతున్నామన్నారు. అన్నదానాలు వలన జీజీహెచ్ లో పారిశుధ్యం పాడవుతున్నందున బయట నుంచి ఇతరులను అన్నదానాలను అనుమతించకుండా రోగుల సహాయకులు అవసరమైన భోజనాలు మధురాన్నం ట్రస్ట్ ద్వారా నే నూరు శాతం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. . ఎవరైనా దాతలు ఉచితంగా ఆహారాన్ని అందించాలనుకుంటే వాటికి బదులుగా వీల్ చైర్ తదితర సౌకర్యాలకు సహకారం అందించాలన్నారు. స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ హాస్పిటల్ ను హెచ్ ఆర్ డి ఎస్ ను కో-ఆర్డినేట్ చేస్తూ అభివృద్ధి పనులను ముందుకు నడిపిస్తున్నారన్నారు.
సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. రమణ యశస్వీ, డియం అండ్ హెచ్ఓ డా. విజయలక్ష్మీ , ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తులసీ రామచంద్ర ప్రభు, డా.ఎస్డీ రసూల్, డా. పీఎస్ హరిత, డా. విచారపు వెంకట రమణ రావు , జింకాన మెంబర్ డా. పి.వి. హనుమంత రావు , నాట్కో వైస్ ఛైర్మన్ డా. ఎన్. సదా శివరావు , కో ఆర్డినేటర్ వై.అశోక్ కుమార్ , ఆర్ ఎం ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News