-టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలు యువతలో శక్తి, ఉత్సాహం నింపే సాధనమని భావించి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేత్రుత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. శనివారం ఉదయం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాణిగారితోట టైటాన్స్ టీమ్ క్రికెట్ క్రీడాకారులకు గద్దె క్రాంతి కుమార్ రూ.10 వేలు విలువ చేసే క్రికెట్ కిట్ ను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుత క్రీడలను అన్ని స్థాయిలలో ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందడుగు వేస్తున్నారన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ విజయవంతం కావడం ఇందుకు ఉదాహరణ అన్నారు. ఈ టోర్నమెంట్‌లో రాష్ట్రవ్యాప్తంగా యువకులు ముందుకు వచ్చి ప్రతిభను కనబరిచారన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేస్తోంది. రాబోయే రోజుల్లో విజయవాడలో జరగనున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వేదిక కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేని వారు గల్లీల్లోనే ఆగిపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, యువత ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా మైదానాలు, స్టేడియంలు ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. క్రీడల ద్వారా రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు రావడంతో పాటు క్రీడాకారులకు ఉద్యోగాలు కూడా త్వరితగతిన లభిస్తాయన్నారు. యువతలో ఆరోగ్యకరమైన శరీర దారుఢ్యం కోసం క్రీడలు ఎంతో అవసరమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో దండగల గణేష్, పొట్లూరి ప్రసాద్, రవీంద్ర, సోము, భార్గవ్, కె.పవన్, ధీరజ్, పందిటి వంశీ, దుర్గారావు, నాగబాబు, సాయిరాం, చక్రి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News