Breaking News

సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన మంత్రి నారాయణ, ప్రత్యేక అధికారి కృష్ణ తేజ

కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాను ప్రభావంపై సోమవారం అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ జీ.బిందు మాధవ్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ, అమలాపురం పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జీఎం.హరిష్ బాలయోగి లతో కలిసి హాజరయ్యారు. తుఫాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. తుఫానుకు ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు, పునరవాస కేంద్రాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గతలో సంభవించిన తుఫాను సంఘటనలను ఆధారంగా అధికారులు మరింత సమర్థవంతంగా పని చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *