Breaking News

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు తేది. 14-12-2025 నుండి 20-12-2025 వరకు ​తూర్పు గోదావరి జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యములో నిర్వహించబడుచున్నాయి అని సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తముగా విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు విస్తృత అవగాహన కలిగేలా పలు రకాల కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అందులో భాగంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు, వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహెూపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పించుట జరుగుతుందన్నారు. “విద్యుత్ పొదుపు ఆవశ్యకత మరియు నూతన సాంకేతిక విజ్ఞానము” అనే అంశముపై నిపుణులతో ఇంజనీరింగ్ కాలేజీల్లో వర్క్ షాపులు నిర్వహిస్తారనన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి వినియోగదారులతో అన్ని విద్యుత్ కార్యాలయముల యందు అవగాహన సదస్సులు నిర్వహించబడునన్నారు. గ్రామీణ ప్రాంతములలో జానపద కళాకారులు మరియు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయబడునన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు ది. 20-12-2025 తేదీన బహుమతుల ప్రధానం చేయబడునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *