Breaking News

అట్ట‌డుగు వ‌ర్గాల అభ్యున్న‌తికి కృషి

– వేస్ట్ పిక్కర్ల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు
– దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా తోపుడు బ‌ళ్ల పంపిణీ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సోమ‌వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ చేతుల మీదుగా ఆరుగురు వేస్ట్ పిక్కర్లకు తోపుడు బళ్ల రిక్షాలు పంపిణీ చేశారు. వేస్ట్ పిక్కర్ల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు రిసోర్స్ సెంట‌ర్ జిల్లా కోఆర్డినేటర్ రమాదేవి తెలిపారు. ఈ వాహనాల ద్వారా వారు స్వతంత్రంగా తమ జీవనోపాధిని కొనసాగించగలరని, ఆదాయం పెంపొందించుకునే అవకాశాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ, లబ్ధిదారులు తమ పిల్లలను బాగా చదివించుకుని, చిన్న వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని స్థిర నివాసాలను ఏర్పరుచుకోవాలని కోరారు. అవసరమైన సహాయం, మార్గదర్శకత ఎప్పటికప్పుడు అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. రమేష్, అనిత, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *