-భవానిపురం రైతు బజార్ లో ప్రారంభించిన తాసిల్దార్ షేక్ ఇస్మాయిల్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి, సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లలో,500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పౌర సరఫరాల శాఖ మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమన్వయంతో జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. విజయవాడ భవానిపురం రైతు బజారులో పశ్చిమ తాసిల్దార్ షేక్ ఇస్మాయిల్ ,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యులకు, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
డిప్యూటీ తాసిల్దార్ పీ శ్రీనివాస్, వీ ఆర్ ఓ మల్లికార్జున రావు, ఎస్టేట్ ఆఫీసర్ కరుణాకర్, మాజీ కార్పొరేటర్, క్లస్టర్ ఇన్చార్జ్ యేదుపాటి రామయ్య, 42 వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు , కూటమి నేతలు బ్రహ్మారెడ్డి, బోయపాటి శ్రీనివాసరావు, బొల్లిగర్ల వెంకట్రావు యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News