Breaking News

ఈనెల 29న విజయవాడలో జరగనున్న డిసైబుల్ క్రికెట్ పోటీలకు ఏపీఎస్‌డీసీ చైర్మన్ అనిమిని రవి నాయుడుకు ఆహ్వానం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSDC) చైర్మన్ అనిమిని రవి నాయుడు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 29వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న డిసైబుల్ క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రా డిసైబుల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇండియన్ నేషనల్ డిసైబుల్ క్రికెట్ జట్టు కెప్టెన్ వసంత్ కుమార్, వైస్ కెప్టెన్ రామిరెడ్డి కూడా పాల్గొని, పోటీల విశేషాలను వివరించి ఆహ్వాన పత్రికను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *