Breaking News

కాంట్రాక్టర్ లు పనుల నాణ్యతకు, సమయపాలన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి

-పనులు పూర్తి చేసిన వాటి బిల్లులు చెల్లింపు భాద్యత చేపడతా…
-జిల్లాలో ప్రముఖ మైన రాజమహేంద్రవరం అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
-ప్రతి శనివారం సమీక్షా నిర్వహిస్తాం…
-కలెక్టర్ కె. మాధవీలత
-ఆర్ ఎమ్ సి కమీషనర్ దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం మునిసిపల్ నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పనులకు టెండర్ దాఖలు పరచాలని కాంట్రాక్టర్ లను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత కోరారు. శనివారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో కాంట్రాక్టర్ లతో కమీషనర్ కె. దినేష్ కుమార్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టవలసి ఉన్న 16 పనులకు టెండర్ దాఖలు చేసి బిడ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. కాంట్రాక్టర్ లు చేపట్టే పనులకు సంబంధించి పనులు నాణ్యతకు, సమయపాలన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి అని కోరారు. పనులు పూర్తి చేసిన తదుపరి చెల్లింపులు జరిపేలా తాను భాద్యతలు చేపట్టగలనని పేర్కొన్నారు. పనులు చెప్పట్టిన తదుపరి బిల్లులు క్లియర్ చెయ్యడం పై ప్రభుత్వం నుంచి స్పష్టత ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ లు పని ఎలా చెయ్యాలో, అందులో లాభాలు విషయం లో సరైన విధానం స్పష్టత ఉంటుందనడం లో సందేహం లేదని తెలిపారు. మీరు, మీ సహచర కాంట్రాక్టర్ లు టెండర్ ల్లో పాల్గొని నగర అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాల్సి ఉందన్నారు. చెప్పట్టవలసిన, జరుగుతున్న పనులను చేపట్టి పూర్తి చెయ్యడం లో ఆయా శాఖలతో సమన్వయము చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమన్వయ లోపం లేకుండా చూడాల్సి భాద్యత అధికారులదే అని, కొన్ని పనుల్లో జాప్యం పట్ల కలెక్టర్ కొంత అసహనం వ్యక్తం చేసారు. కలిసి అడుగులు వేస్తే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతి శనివారం పనుల ప్రగతి, తదితర అంశాలపై సమీక్షా చేస్తానని తెలిపారు. నగర పాలక సంస్థ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ కోరారు. నగర అభివృద్ధి కోసం ఇటీవల మంజురైనా రు.125 కోట్ల పనుల్లో టెండర్ ప్రక్రియ లో భాగంగా కాంట్రాక్టర్ లతో సహృద వాతావరణం లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో ఎస్సిఈ జి. పాండురంగరావు, ఆర్ ఎమ్ సి, ఇతర శాఖల అధికారులు అర్విఏస్ శేషగిరి రావు, ఎమ్ వి రాజారావు, పలువురు కాంట్రాక్టర్ లు, ఇరిగేషన్, టూరిజం, ఆర్ అండ్ బి, ఆర్ ఎమ్ సి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *