Breaking News

సి.యం ను కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దావోస్ పర్యటనకు బయలుదేరుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్సులు బండి.శ్రీనివాసరావు మరియు కె.వి.శివారెడ్డి ల ఆధ్వర్యంలో కలిసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరపున విదేశీపర్యటన విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం,సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ విషయం ముఖ్యమంత్రివర్యుల ద్రుష్టికి తీసుకొని వెళ్లగా సంతోషంగా ఉండండి మీ భవిష్యత్తుకు నా భరోసా అని,ప్రోబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ అతి త్వరలో పూర్తి అవుతుందని సంతోషంగా ఉండాలని దేవుని దయతో మీకు అంతా మంచే జరుగుతుందని ముఖ్యమంత్రివర్యులు ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.డి.జాని పాషా కు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగుల సంక్షేమం యన్.చంద్రశేఖర్ రెడ్డి,ఎ.పి.జె.ఎ.సి సభ్యసంఘాల నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *