విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ శక్తులన్నింటిని ఎకంచేసి సామాజిక స్థితికి చేకూర్చి ఏకాగత్ర సాధించడం వలన నిజమైన శక్తిని సాధించడమే యోగా అని, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
అమరావతి యోగా మరియు యోరోబిక్స్ అసోసియేషన్ సంయుక్త అధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆధివారం నిర్వహించిన యోగా క్యాంప్ ముగింపు కార్యక్రమం, ప్రత్యేక యోగా తరగతుల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన పూరతన కాలం నుండే యోగా ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఆరోగ్యకర జీవితానికి శరీరం మనస్సుల మధ్య సమతౌల్యానికి యోగా ఎంతో దొహద పడుతుందన్నారు. ప్రపంచ మానవాలికి మనదేశం ఇచ్చిన కానుక యోగా అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురై ఆనారోగ్యం భారిన పడుతున్నారన్నారు. ఆరోగ్య సమస్యల పరిష్కరానికి సహజసిద్దమైన సులభ మార్గం యోగా విద్యే అన్నారు. దీనిని గుర్తించి యోగాకి ప్రాచుర్యం కల్పించి ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలను అవలంభించడం ద్వారా మానసిక వత్తిడిని తగ్గించుకుని ఆరోగ్య వంతులుగా జీవించాలనే లక్ష్యంతో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా ఆసనాల ద్వారా హైపర్ టెన్షన్, థైరాయిడ్, మధుమేహం వంటి వ్యాధుల భారిన పడకుండా నిత్యయవ్వనవంతులుగా ఉండగలుగుతారన్నారు. యోగా సాధన దినచర్యగా మారిన నాడు ఔషదాల వినియోగం ఘననీయంగా తగ్గించగలుగుతామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను యోగా సాదన పట్ల ఆసక్తి కలిగించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు కోరారు.
అమరావతి యోగా మరియు యోరోబిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2017లో అసోసియేషన్ రిజిస్ట్రర్ అయిన నాటి నుండి ప్రతీ ఏటా 2 వేల మందికి ఉచితంగా యోగా శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అందించిన వారికి ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందించడం జరుగుతుందన్నారు. అంతార్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక యోగా శిక్షణ తరగతులను నిర్వహించి యోగా దినోత్సవం నాడు సర్టిఫికేట్లను, మెడల్స్, యోగా డ్రస్‌లను విద్యార్థులకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తొలుత జిల్లా కలెక్టర్ డిల్లీరావు యోగా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో కలిసి యోగా ఆసనాలలో పాల్గొన్ని యోగా ఆసనాలను వేశారు. వేసవి శిక్షణ పొందిన 65 మందికి కలెక్టర్ సర్టిఫికేట్లను బహుకరించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యోరోబిక్ అసోసియేషన్ హాల్ ఎదుట మొక్కలను నాటారు.
కార్యక్రమంలో అమరావతి యోగా మరియు యోరోబిక్స్ అసోసియేషన్ కార్యదర్శి యండి ఇక్బాల్, కోశా అధికారి పివి రమణ, ఉపాఅధ్యక్షులు టి హరికృష్ణ, యోగా కోచ్ ఏ సత్యానారాయణ, అసోసియేషన్ సభ్యులు ఏ.యల్లారావు, జి. లావణ్య కుమార్, యండి షిరాజ్, శ్రీనివాస్, ఎన్‌టిఆర్ జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరి మురళి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News