Breaking News

టీడీపీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర పుట్టినరోజు వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం కొల్లు రవీంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సత్కరించి, కేక్‌ను కట్ చేయించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ కొల్లు రవీంద్రకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా స్థాయి నుండి ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుయువత అధ్యక్షునిగా పనిచేసి, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసి, పార్టీలో అత్యున్నత స్థానమైన పొలిట్‌బ్యూరో సభ్యునిగా, బీసీ విభాగం రాష్ట్ర అద్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడిగా, ఆత్మబంధువుగా నేడు రాష్ట్ర వ్యాప్త బీసీ సోదరుల సంక్షేమానికి కృషి చేస్తూన్నారని కొనియాడారు, తెలుగుదేశం పార్టీకి కొల్లు రవీంద్ర ఒక ఆస్తి, ఆయన నాయకత్వాన పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నా మీద పెట్టిన బాద్యతగా తాను భావిస్తున్నానని, రాష్ట్రమంతటా తిరిగి తెలుగుదేశం పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకత తెలియపరచి బలహీనవర్గాలను ఏకం చేస్తానని, ఈ దుర్మార్గమైన పరిపాలన మీద, బీసీ నాయకుల మీద దాడులు, నిన్న అయ్యన్న గారి ఇంటి ప్రహరిని జేసీబీ కూల్చేయడం, అనేకమందిని పొట్టన పెట్టుకుంటున్నారు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తానని, ఇంత పెద్ద ఎత్తున తన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలిపిన నేతలకు, పార్టీ శ్రేణులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు చెన్నుపాటి గాంధి, కొత్త నాగేంద్ర కుమార్ (నాగబాబు), భీమవరపు సుబ్బారావు, పార్లమెంట్ ఉపాధ్యక్షులు లింగమనేని శివరాంప్రసాద్, నాయకులు ఎరుబోతు రమణారావు, సాధికార కమిటీ కుల సంఘాల అధ్యక్షులు పేరేపి ఈశ్వర్, మరుపిల్ల తిరుమలేష్, గుర్రపుసాల రామకృష్ణ, ధూళిపాళ్ల ఏసుబాబు, మద్దిరాల గంగాధర్ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు కాకు మల్లికార్జున యాదవ్, పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ, నాయకులు పరిశపోగు రాజేష్, షేక్. ఆషా, బంకా నాగమణి, సింగం వెంకన్న, పామర్తి రాజా, కోడూరు ఆంజనేయ వాసు, రామకృష్ణ, పూల రామచంద్రరావు, బీకేఎం నాని, మరియు బీసీ నాయులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *