Breaking News

అందరినీ అలరించిన కూచిపూడి నృత్యోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవాగ్దేవి కూచిపూడి నృత్యాలయ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు నిర్వహించిన కూచిపూడి నృత్యోత్సవం ఆదివారం ముగిసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు సీనియర్‌ కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నాట్యాచార్యుడు పిళ్ళా ఉమామహేశ్వరపాత్రుడు మాట్లాడుతూ కూచిపూడి నాట్యం భారతదేశానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ అనే కళాకారిణి నాట్యం చేస్తూనే కాలితో నెమలి చిత్రాన్ని వేసి అబ్బురపరిచింది. అనంతరం పలువురు నాట్యాచార్యులను ఆత్మీయంగా సత్కరించి నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబరచిన చిన్నారులకు ప్రశంసాపత్రాలు. జ్ఞాపికలతో పాటు శ్రీ వేంకటేశ్వర, నటరాజ్‌ అవార్డ్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ వ్యవస్థాపకుడు సప్పా శివకుమార్‌, గోళ్ళ నారాయణరావు, కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డుగ్రహీత వేదాంతం రాధేశ్యామ్‌, నగరపాలక సంస్థ అధికారి కె.అంబేద్కర్‌, గాన కోకిల కుమార సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *