Breaking News

గ్రీనరీ పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం బ్యారేజి నుండి సీతమ్మ వారి పాదాల వరకు గల ప్రాంతాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా అకర్షణీయమైన మొక్కలు ఏర్పాటు చేసిన గ్రీనరి అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని చేపట్టి గ్రీనరీ అభివృద్ధి పనులు నాలుగు రోజులలో పూర్తి చేయాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. అదే విధంగా సీతమ్మ పాదాలు వెనుకవైపున ఖాళి స్థలము నందు కూడా గ్రీనరీ పెంపొందించుటకు ప్రణాళికలు మరియు డిజైన్ సిద్దం చేసి గ్రీనరీ పనులు చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంలో కెనాల్ రోడ్ నందు ఫెన్సింగ్ గ్యాప్ లు ఉండుట గమనించి పూర్తి స్థాయిలో కెనాల్ బండ్ నందు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పై పర్యటనలో ఉద్యానవన శాఖాధికారి శ్రీనివాసు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *