Breaking News

ఇన్వో తరఫున కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న వీరులకు సత్కారం… : మోటూరి శంకర్‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
23వ కార్గిల్‌ విజయదినోత్సవం సందర్భంగా ఇంటిగ్రేటెడ్‌ నేషనల్‌ వెట్రన్‌ ఆర్గనైజేషన్‌ (ఇన్వో) ఆధ్వర్యంలో కార్గిల్‌ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ఇరువురు సైనికులకు మంగళవారం విజయవాడ, మొగల్రాజపురంలోని డైరెక్టర్‌ సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీస్‌ నందు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్‌ నేషనల్‌ వెట్రన్‌ ఆర్గనైజేషన్‌ (ఇన్వో), నేషనల్‌ ప్రెసిడెంట్‌ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ కార్గిల్‌ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న ఇరువురు సైనికులకు (హవల్దార్‌ బి.వి.కృష్ణయ్య) ఎన్‌కె. జి.తిరుపతిరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.వి.రాజారావుల ద్వారా మెమెంటో అందజేసి శాలువాతో సత్కరించి గౌరవ అభినందనలు తెలియయడం ఆనందంగా వుందన్నారు. అనంతరం కార్గిల్‌ యుద్ధంలో ఆమరులైన వీరులను స్మరించుకోవటం మనం వారికి ఇచ్చే గౌరవం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్వో వ్యవస్థాపకులు అన్నే రామారావు, సూపరింటెండ్‌ ఆర్‌ఎస్‌బి కృష్ణభోజ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *