గుంటూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
గుంటూరు నగరాన్ని పర్యావరణహితంగా, స్వచ్చతతో కూడిన ఆకుపచ్చని నగరంగా మార్చుకోవడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని నగర కమిషనరు కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న హరిత నగరాల్లో భాగంగా ఎపి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫీకేషన్ కార్పోరేషన్ (ఏపిజిబిసి) ద్వారా గుంటూరు నగరంలో రూ.5.65 కోట్లతో 57 కిలోమీటర్లు సెంట్రల్ మీడియన్స్, రోడ్ పక్కన మార్జిన్స్ లో పచ్చదనం పెంపుకు, నగరంలోని 15 ఐలాండ్స్ లో రూ.19 లక్షలతో 1266 చదరపు మీటర్లు గడ్డి లాన్, వివిధ రకాలైన పూల (పొట్టి జాతి షర్బ్) మొక్కను నాటెందుకు, అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రధాన ఎంట్రీ పాయింట్స్ లో, సెంట్రల్ మీడియన్స్, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల గోడలకు 5820 చదరపు మీటర్లు వాల్ ఆర్ట్ చేయడానికి రూ.45.62 లక్షలు కేటాయించామని పేర్కొన్నారు. నగరంలోని, పార్క్ ల్లో, నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకంకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నగరంలో చేపట్టిన పచ్చదనం, సుందరీకరణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలో పనులు ప్రారంభించి, ఈ ఏడాది డిశంబర్ నాటికి పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. అలాగే నగరంలో అయిన కొరెటేపాడు పార్క్, ఆర్.టి.సి.కాలని, షాప్ ఎంప్లాయిస్ కాలని, లాల్ జాన్ భాష పార్క్, ఎస్.వి.ఎన్. కాలని, శ్యామల నగర్, కృష్ణ నగర్ లల్లో పార్క్ ల్లో పచ్చదనం పెంపు కోసం మొక్కలు, లాన్, పిల్లల ప్లే ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రధానమైన మానస సరోవరం పార్క్ అభివృద్ధికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈ.ఓ.ఐ.)ని పిలవడం జరిగిందని, గాంధీ పార్క్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే లెవలింగ్, అంతర్గత పైప్ లైన్ల ఏర్పాటు జరిగాయని, త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో సెంట్రల్ మీడియన్స్, రోడ్ మార్జిన్లు, ట్రాఫిక్ ఐలాండ్ ల్లో వివిధ రకాలైన పూల మొక్కలతో అభివృద్ధి చేయడం వలన ప్రధాన రహదారుల్లో ఆహ్లాదకరమైన పచ్చదనంను పెంపొందించుట, వాహన కాలుష్యాన్ని నియంత్రించి, ప్రజలకు ప్రాణాధారమైన ఆక్సిజన్ శాతాన్ని పెంపొందించడం జరుగుతుందన్నారు.
Prajavartha Online Telugu News