Breaking News

మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి…

-చేయూత వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి కుటుంబానికి మహిళలే రథసారథులుగా వ్యవహరిస్తూ.. ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని బూదాల ఆదాం కళ్యాణ మండపం నందు ఆరో రోజు జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు గౌరవం పెరగాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. గతంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అనేక హామీలిచ్చి చంద్రబాబు నిలువునా మోసగించారని గుర్తుచేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి తోడుగా నిలిచారన్నారు. తండ్రి బాటలో పయనిస్తున్న సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణాలను విడతల వారీగా తిరిగి చెల్లిస్తూ మహిళలకు అండగా నిలబడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నేడు ఒక్కో పొదుపు సంఘం రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు పొందుతున్నట్లు తెలిపారు. మరోవైపు విజయవాడ నగర చరిత్రలో 97 వేల మంది ఆడపడుచులకు ఒకేసారి ఇళ్ల పట్టాలను మంజూరు చేసిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోనూ 27 వేల మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో.. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల విలువైన పట్టాను అందజేసినట్లు పేర్కొన్నారు.

మహిళల జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యం
అర్హులైన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు వ్యాపార రంగంలో వృద్ధి చెందేలా.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ. 75 వేల ఆర్థిక చేయూత అందించడం జరుగుతోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రస్తుతం మూడో విడత నాటికే ఒక్కక్కరికి రూ.56,250 జమ చేయడం జరిగిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 10,875 మంది అక్కచెల్లెమ్మలకు మూడేళ్లలో రూ. 43 కోట్ల 38 లక్షల లబ్ధి చేకూర్చగా.. ఈ ఏడాది రూ. 20.39 కోట్లు మహిళల ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు. అలాగే 30వ డివిజన్ లో 651 మందికి రూ. 1.22 కోట్లు., 57 వ డివిజన్లో 893 మందికి రూ. 1.67 కోట్లు., 59 వ డివిజన్లో 842 మందికి రూ. 1.57 కోట్లు.. మొత్తంగా 2,386 మందికి రూ. 4.47 కోట్లు బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నగదుకు అనుబంధంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపార రంగంలో ఒక్కసారి మనం పెట్టే పెట్టుబడి.. మన కుటుంబానికి రోజువారీ ఆదాయాన్ని సంపాదించి పెడుతుందని మల్లాది విష్ణు అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగపరచుకుని నియోజకవర్గంలో 322 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు ప్రారంభించడం శుభపరిణామన్నారు. అలాగే మల్టీ నేషనల్ కంపెనీల ద్వారా హోల్ సేల్ ధరలకే ఉత్పత్తులు అందిస్తుండటంతో 45 మంది వివిధ వ్యాపారులలో రాణిస్తున్నట్లు తెలియజేశారు. చేయూత సాయంతో ఒక అపార్ట్ మెంట్లో వాచ్ మెన్ కుటుంబం కూరగాయాల దుకాణాన్ని ప్రారంభించి.. రోజుకి రూ. 700 – 1000 ఆదాయాన్ని గడిస్తున్నట్లు తెలపడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇదే స్ఫూర్తిగా మహిళలందరూ ముందుకు సాగుతూ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలని, వ్యాపారరంగంలో రాణించాలని ఆకాంక్షాంచారు.

అనంతరం నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఓట్ల కోసం ఎన్నికల సమయంలో పథకాలు అమలు చేసేవారని విమర్శించారు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ప్రారంభించాలన్నా, మహిళల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే చేపడతారని తెలిపారు. కనుకనే ఈ ప్రభుత్వం పనితీరుపై మహిళలందరూ నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మహిళల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు చెందిన పలువురు మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా తమకు కలుగుతున్న లబ్ధిని, వ్యాపార ఎదుగుదలను వివరించారు.

షేక్ మహిమున్నీసా, లబ్ధిదారు మాట్లాడుతూ.. చేయూత పథకంతో అప్పుల కోసం బయట వ్యక్తుల వద్దకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఇప్పటివరకు మూడు విడతల చేయూత సాయం అందినట్లు తెలిపారు. అలాగే మనవడికి రెండు సార్లు అమ్మఒడి వచ్చిందని.. కొండపావులూరులో ఇంటి పట్టా కూడా మంజూరైనట్లు వివరించారు. తన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన జగనన్నకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మల్లాది విష్ణు చేతులమీదుగా లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, సిడిఓ జగదీశ్వరి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఎండి షాహినా సుల్తానా, ఇసరపు దేవి, జానారెడ్డి, నాయకులు హఫీజుల్లా, ఇసరపు రాజారమేష్, ఉమ్మడి వెంకట్రావు, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, భోగాది మురళి, రామాంజనేయులు, శాంతకుమారి, గల్లెపోగు రాజు, షేక్ అమిత్, ఇస్మాయిల్, కొండలరావు, మేడా శ్రీను, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *