-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు నగరoలోని రాజీవ్ గాంధీ పార్కు ఆధునీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మరియు మిగితా వి.యమ్.సి అధికారులతో కలిసి పార్కును సందర్శించినారు. పార్కు ఆవరణ మొత్తము పరిశీలన జరిపి ఏయే ప్రాంతములలో ఏ విధమైన ఏర్పాటు చేయవలెనో గుర్తించి చుట్టూ విశాలముగా సౌకర్యవంతముగా ఉండునట్లు చూడవలెనని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పార్కు నందు ఖాళీగా ఉన్న ప్రదేశాలలో ఉసిరి, సంపంగి, రాయల్ ఫామ్స్, ట్రావలెర్ ఫామ్స్, పారిజాతం, పున్నాగ మొక్కలను కొత్తగా నాటవలసినదిగా మరియు పార్కులో గల బయోడైవర్సిటీ మ్యూజియం లో కేటగిరీ వైజ్ మొక్కలు, జంతువులు, పక్షులు, బొమ్మలను కేటగిరీకి ఒకటి చొప్పున ప్రదర్సనకు ఉంచమన్నారు. విజయవాడ నగర ప్రజలకు పూర్తి స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణం అందించే విధంగా వింటర్ సీజన్ ఫ్లవర్స్ మొక్కలను అన్ని చోట్ల నాటి పార్క్ కు వచ్చు సందర్శకులకు ఆకర్షణియంగా కనిపించేలా చేయాలనీ పలు సూచనలు చేసినారు.
కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనంతో పాటుగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణo అందించాలనే లక్ష్యంగా పార్క్ ను అభివృద్ధి చేసి పున: ప్రారంభం చేపట్టిన్నట్లు కమిషనర్ తెలిపారు. 8.68 ఎకరాలు కలిగిన రాజీవ్ గాంధీ పార్క్ లో 14వ ఆర్ధిక సంఘ నిధులతో రూ. 256.00 లక్షలతో అభివృద్ధి చేసేమని అన్నారు. పార్కును ఇంకా ఉత్తమమైన పార్కుగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా రైల్వే గేటు స్థలములో బయటకు వెళ్ళే వాహనములను పంపుటకు రైల్వే పర్మిషన్ కోరగా కలెక్టర్ గారు పాజిటివ్ గా స్పందించినారు.
ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, పార్కు సూపర్వైజర్స్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News