Breaking News

రెడ్‌క్రాస్‌ సేవలలో ఉద్యోగుల సహకారం అభినందనీయం…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపద సమయాలలో ప్రజలకు సేవలందించడంలో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి అందిస్తున్న సేవలలో అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యులు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ పిలుపు మేరకు ఏపి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీదేవి, మరియు ఉద్యోగులు స్పందించి 59 వేల 2 వందల రూపాలయను గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావును కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు ఆపదలు సంభవించిన సమయాలలో ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం తరుపున కొంత మేర ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉద్యోగులు వారికి తోచిన విధంగా రెడ్‌క్రాస్‌ సొసైటికి ఆర్ధిక సహాయం అందించాలని కోరామన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి సేవలలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చిన ఏపి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీదేవి, మరియు ఉద్యోగులు 59,200ల రూపాయలను ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి సభ్యత్వం రూపంలో అందించడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి భవిష్యత్‌లో చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగాస్వామ్యులయ్యేందుకు వీరు అందించిన సహకారం స్పూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *