Breaking News

రైతు సోదరులకు, భూ యజమానులకు విజ్ఞప్తి

-రీ సర్వే కి సహకరించండి
-డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియ జరుగుతోంది..
-ఆర్డీవో ఎస్. మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిదిలో భూముల రీ సర్వే ప్రక్రియ మొదలు అయ్యిందని కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ మీ భూ రికార్డు లు తాజా పరచుకొని ఆధునిక భూ రికార్డ్ లో వాటి వివరాలు పొందుటకు సచివాలయం లోని మీ గ్రామ రెవిన్యూ అధికారి ని సూచించిన డాక్యుమెంట్లు తో కలవాలని ఆర్డీఓ పేర్కొన్నారు. ఈ దిగువ తెలిపిన రికార్డ్ లు వెంటనే అందచేయవలసి ఉంటాయన్నారు.

1. భూమి దస్తవేజులు/ వీలునామా/ పంపిణీ డీడ్/ గిఫ్ట్ డీడ్/ డి ఫారం పట్టా మొదలగు ఫొటోస్టాట్ నకలు.

2. ఆధార్ కార్డ్ ఫొటోస్టాట్.

3. బాంక్ అకౌంట్ పాస్ బుక్ నకలు.

4.  సెల్ ఫోన్ నెంబర్/ మెయిల్ అడ్రస్ వివరాలు.

5. ఇప్పటికే మీకు గల పట్టాదారు పాస్ బుక్ నకలు.

6. మీ భూమి పై కోర్ట్ వివాదాలు (రెవెన్యూ కోర్టు/ సివిల్ కోర్ట్ ) మొదలగు వాటి వివరాలు

7. చనిపోయిన భూ యజమానుల వారసులు వెంటనే మీ పేరు పై భూములు మార్చుకోనుటకు సచివాలయం లో దరఖాస్తు చేసుకోండి.

8.  ఎవరి వద్దనైనా భూములు కొనుగోలు చేస్తే మీ పేరు పై కి వెంటనే రికార్డ్ ఆన్లైన్ చేయించుకోండి.

పై సూచించిన విధంగా డాక్యుమెంట్లు తీసుకుని మీ సచివాలయం లో గ్రామ రెవిన్యూ అధికారికి వెంటనే అందచేయడం ద్వారా భూముల రీ సర్వే ఫలితాలు అందుకోవచ్చునని మల్లి బాబు తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *