Breaking News

బ్యాంకుకు ఎస్ హెచ్ జి లకు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో హౌసింగ్ ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయడానికి బ్యాంకుకు ఎస్ హెచ్ జి లకు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు కు జగనన్న తోడు, చేయూత లకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. శుక్రవారం లీడ్ బ్యాంకు వారి ఆధ్వార్యంలో  బ్యాంకర్ల, జిల్లా అధికారులతో  2022-23 త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి చైర్మన్ గా  జిల్లా కలెక్టర్  అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ పి ఐ కింద అర్హులైన పేదలందరికీ స్వంత ఇంటి కల సాకారం చేసే విధానం చేపట్టడం జరిగిందని, క్షేత్ర స్థాయి లో పర్యటన సమయంలో లబ్దిదారులు కూడా ఆసక్తి కనబరచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎస్ హెచ్ జి గ్రూపులకు రూ.35 వేల చొప్పున ఇంటి నిర్మాణం కోసం రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఆ దిశలో ఇతర జిల్లాల ప్రగతి, రాష్ట్ర సగటు మేర జిల్లాలో కూడా గ్రౌండింగ్ చెయ్యాలని, రాష్ట్ర సగటు 70 శాతం ఉండగా, జిల్లాలో ఆన్లైన్ 44 శాతం మాత్రమే ఉందన్నారు. ఆఫ్ లైన్ లో 66 శాతం మేర ప్రగతి సాధించినట్లు పేర్కొన్నారని, మెప్మా, డిఆర్డిఎ అధికారులు ఇచ్చిన రుణాల వివరాలు ఆన్లైన్ లో డేటా అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు. గత త్రైమాసికంలో 22 శాతం నుంచి ఇప్పుడు 44 శాతం కి రావడం జరిగిందని, ఎస్ హెచ్ జి మహిళా సభ్యులను రూ 35 వేలు అదనపు ఇంటి రుణాలు మంజూరు చేయాలని కోరారు. టిడ్కో గృహాలకు కూడా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో భాగంగా బ్యాంకుల వారి వివిధ రుణాలు ప్రగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు, కౌలు రైతుల మరింత పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత బ్యాంకర్ల ను కోరడం జరిగింది. రబీ సీజన్లో నూరు శాతం రుణాలు మంజూరు కు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. సి సి ఎల్ ఏ కార్డు దారులకు పంట రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

అనధికార సారా విక్రయాలను అరికట్టడం లో ఆయా రంగంలో ఆధారపడి జీవిస్తున్న వారికి మెరుగైన జీవన విధానం చేపట్టడానికి రుణాలు అందించడం కోసం 278 మందిని గుర్తించి, ఆమేరకు ప్రోత్సహం ఇచ్చినట్లు మాధవీలత పేర్కొన్నారు. మార్కెట్ పరంగా అవకాశం ఉన్న రంగాల్లో వారికి ఆసక్తి మేరకు నైపుణ్యం ఇచ్చే ఆలోచన చేస్తున్నా మన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం లో 200 యూనిట్స్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు . పి ఎం ఈ జి ఎస్ కింద సబ్సిడీ పొందేందుకు సిఫార్సు చెయ్యవొచ్చునని పేర్కొంటూ, స్క్రూటిని చేసిన ధరఖాస్తు లు జనవరి ఒకటవ తేదీ తరువాత బ్యాంకు లకు పంపడం జరుగుతుందన్నారు. వాటిని త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలన్నారు. మహిళా పారిశ్రామిక వేత్త లను ప్రోత్సహించేలా బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు.

జగనన్న చేయూత కింద పశు సంవర్ధక శాఖ కి చెందిన యూనిట్స్ స్థాపన కోసం డి ఆర్ డి ఎ – పశు సంవర్ధక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఇండియన్ బ్యాంక్ రీజనల్ ఏ జీ ఎం .. బి జి ఆర్ నాయుడు మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు క్రెడిట్ రుణాలు రూ.23,653 ఇవ్వడం ద్వారా 151 శాతం మేరకు ప్రగతి సాధించడం జరిగిందన్నారు.  డిపాజిట్ లుగా రూ.15635 కోట్లు సేకరించామన్నారు.

ఏల్ డి ఎం జీ. దీలిప్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల, పారిశ్రామిక తదితర వివిధ సెక్టర్ల లో యేడాది వార్షిక లక్ష్యం రూ.12,122 కోట్ల కు గాను రూ.9009 కోట్లు 74 శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. అగ్రి సెక్టర్ లో 6398 కోట్ల కి 4856 కోట్లు (76శాతం) సాధించినట్లు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ లక్ష్యంలో 98 శాతం ఇవ్వడం జరిగిందన్నారు.

నాబార్డ్ అధికారి సూర్యనారాయణ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రోత్సాహక పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో ఇండియన్ బ్యాంకు రీజినల్ ఏ జి ఎం.  బిజిఆర్ నాయుడు, నాబార్డ్ అధికారి సూర్యనారాయణ, ఆర్భిఐ ప్రతినిధి నాగ ప్రవీణ్, ఎల్ డి ఏం .. జీ. దిలీప్ కుమార్,  వివిధ శాఖల జిల్లా అధికారులు  ఎస్. మాధవరావు, ఎస్. సుభాషిణి, కె. వెంకటేశ్వర రావు కే. శ్రీనివాసరావు, వివిధ బ్యాంకు అధికారులు, వ్యవసాయ, డి ఆర్ డి ఎ, మెప్మా, పరిశ్రమలు, ఇతర అనుబంధ శాఖల అధికారులు,  బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *