Breaking News

ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ దారుల EKYC నమోదు ప్రక్రియ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ GO No. 07 తేది 11.01.2023 ఉత్తర్వులు ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి CFMS I.D ద్వారా EKYC చేసి ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ తో ఆన్ లైన్ నందు అప్డేట్ చేసి వారి సంబంధిత జీతములు డ్రా చేయు అధికారి (DDO) వారికి పంపవలయను…అనంతరం సంబంధిత DDO లు బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల యొక్క E- KYC ని అప్డేట్ చేయవలసి వున్నది. అదేవిధముగా ఖజానా శాఖ పరిధిలోని పెన్షన్ దారులందరూ వారి యొక్క CFMS I.D No. ద్వారా ఆధార్ లింక్ తో చేయబడిన ఫోన్ నెంబర్ ద్వారా E-KYC ని సంబంధిత ఖజానా కార్యాలయమునకు పంపవలెయను. అనంతరం సంబంధిత ట్రెజరీ అధికారి వాటిని పరిశీలించి పిమ్మట అప్డేట్ చేయవలెయును. ఈ ప్రకీయ మొత్తం ఉద్యోగులు మరియు పెన్షన్ దారులు త్వరితగతిన పూర్తి చేయవాల్సిందిగా తెలియజేయడమైందని జిల్లా ఖజానా అధికారి ఎం. లక్ష్మీకర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *