రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), విజయవాడ వారు ఈ సంవత్సరము నిర్వహించుచున్న 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్ అండర్ 19 యూత్ బాలురకు చాంపియన్ షిప్ పద్దతిలో మొదటగా జిల్లా స్థాయిలోను, తదుపరి రాష్ట్రస్థాయిలోను ఈ పోటీలు నిర్వహించుటకు తగు చర్యలు తీసుకొనియున్నారు.
కావున 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్ ఈ నెల ది.22.01.2023 తేదిలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కాకినాడ జిల్లా, కాకినాడ క్రీడా ప్రాంగణము నందు ఉమ్మడి తూర్పుగొదావరి జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించడం జరుగును.
ఈ ఎంపికలలో పాల్గొను జట్టు జిల్లా స్థాయిలో రూ.300/-లు ఎంట్రీ ఫీజు చెల్లించి ధరఖాస్తు పూర్తి చేసి క్రీడాకారులు తమ రిజిస్ట్రేషన్ చేసుకొనిన పిదప మాత్రమే ఈ పోటీలలో పాల్గొనవచ్చును. ధరఖాస్తుతో బాటు పుట్టిన తేదీ దృవీకరణ పత్రము / ఎస్.ఎస్.సి. మర్క్ మెమో, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు & ఆధార్ కార్డు నకలు జత చేసి ఇవ్వవలయును మరిన్ని వివరాలకు పి.బి.నాగే౦ద్రకుమార్ & బి.దీపక్ ఆకాష్, హాకి కోచ్ వారి నెం. 9440919379 & 7386446889 లలొ సంప్రదించ గలరు. ఆశక్తి గల క్రీడాకారులు ఉదయం 07.00 గంటలకు హాజరు కావలయును.
ఈ ఎంపికలలొ ఎంపికకాబడిన జట్టు రాష్ట్ర స్థాయి 2వ శాప్ లీగ్ హాకి చాంపియన్ షిప్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, కాకినాడ జిల్లా, కాకినాడ ఆస్ట్రొటర్ఫ్ హాకి క్రీడా ప్రాంగణములో జరుగును.
Tags rajamendri
Check Also
ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు
-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …
Prajavartha Online Telugu News