Breaking News

జగనన్నకుచెబుదాం” (జెకెసి 1902) వెబ్ పోర్టల్ లో స్పందన దరఖాస్తులు చేసుకోవచ్చు

-సోమవారం కలెక్టర్ కార్యాల యం లో 220 దరఖాస్తులు.
-అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు.
-ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుం డా అధికారులు అర్జీలను పరి ష్కారం చెయ్యాలి.
-అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నాం.
-శాఖా పరమైన కోర్టు కేసులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారానికి కృషి చేయాలి.
-జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకుచెబుదాం (జెకెసి) వెబ్ పోర్టల్ లో స్పందన దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.మాధవీలత తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కె. మాధవి లత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు ప్రజలు నుంచి అర్జీలను స్వీకరించడం తో జరిగింది.

ఈ సందర్బంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడీన విధంగా క్షేత్రస్థాయిలో పరిష్కరించి అర్హత కలిగిన అర్జీ దారులకు సకాలంలో న్యాయం చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజల నుండి స్పందనలో వివిధ సమస్యలు పరిష్కార నిమిత్తం నుంచి 220 అర్జీలు స్వీకరించామన్నారు.

రాష్ట్ర స్థాయిలో అర్జీల పరిష్కారాన్ని ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటారన్నారు. జెకెసిలో వచ్చిన అర్జీలు 1902 కాల్ సెంటర్ కు పంపడం జరుగుతుందన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్య తతో కూడిన పరిష్కారాన్ని అందించాలన్నారు. స్పందన పోర్టల్ నుంచి జెకేసీగా పోర్టల్ మారుతున్నందున జిల్లా అధికారు లందరు పోర్టల్ ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లా అధికారు లు వ్యక్తిగత భాద్యతతో అర్జీల ను పూర్తి స్థాయిలో పరిష్కరిం చాల న్నారు. శాఖ పరమైన కోర్టు కేసులు సంబంధించి తక్షణం ఫైలింగ్ చేపట్టాలని, ఆలస్యం జరిగిన సందర్భాల్లో కలెక్టర్, రాష్ట్ర కార్యదర్శులు తాఖీదులు అందు కోవడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, పభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు నిర్వహిస్తున్నందున జిల్లా అధికారులు శాఖలు వారి అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రా ధాన్యతా అంశాలు పై ప్రగతి నివేదికలు సమీక్షలకు ముందు గానే అందించే విధంగా సమా యత్తం కావాలన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుక లను అత్యంత ఘనంగా ని ర్వహించాలని , దేశ భక్తి ప్రతి బంభించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశిం చారు. నూతన జిల్లా గా ఏర్పాటు చేసిన తరువాత మొదటి గణతంత్ర ది నోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలకు చెందిన కార్యాచరణ పై కలెక్టర్ దిశా నిర్దేశనం చేశారు. ప్రాథమికంగా తొమ్మిది శాఖలకు చెందిన వాహన శకటాల ప్రదర్శన ఏర్పాటు చెయ్యడం పై ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జనవరి 26 న జిల్లా స్థాయి జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం లో తప్పనిసరిగా అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ముందస్తుగా ప్రదర్శన ఇచ్చే వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు

ఈ స్పందన కార్యక్రమము లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జి. నరశింహు లు, డి ఎం హెచ్ ఓ డా. కే వెంక టేశ్వరరావు, డిసిహెచ్ఒ డా.సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్ రావు, డీ పి వో పి. జగదాంబ, పశుసం వర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవింద్, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి కే. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *