Breaking News

ఎఐఎస్సి ఆర్పిఎస్ క్యాలెండరు అవిష్కరణ…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పోందుపరచటం వలనే నేడు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అవకాశం కలిగిందని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం (ఎఐఎస్సి ఆర్పిఎస్) జాతీయ అధ్యక్షులు మేకల ముత్తన్న తెలిపారు. శనివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆ సంఘం రూపొందించి నూతన సంవత్సర క్యాలెండర్ను నాయకులు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 52 సం..ల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆర్థిక అభివృద్ధి కోసం దేశంలో సోర్స్, ఎడ్యుకేషన్, అకాడమిక్, ఆర్థిక వనరులు వంటి వాటికోసం నిరంతరం సేవ చేస్తున్న సంఘం తమదే అన్నారు. గ్రామీణ ప్రాంతంలో అట్టడుగున ఉన్న ప్రజలకు ఆర్థికంగా దెబ్బ తిన్న వారికి అండగా నిస్తున్నామన్నారు. తమకు ఉన్న సోసైటీ ద్వారా వారికి అబ్ధి చేకూర్చుతున్నామన్నారు. అయితే తమది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఏ పొలిటికల్ సంఘానికి సంబంధం లేకుండా ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ దళిత మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగిన నిస్వార్ధంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామన్నారు. నేడు మనం ఓటు వేస్తున్నామంటే ఇది కేవలం అంబేద్కర్ పుణ్యమన్నారు. రాజ్యాంగంలో 18 సం..లు పూర్తయిన ప్రతి ఒక్కరికి ఓటు కల్పించారన్నారు. గతంలో కేవలం అగ్రవర్ణాలకి మాత్రమే ఓటు హక్కు ఉండేదన్నారు. సేవ చేయటానికి డబ్బులు అవసరం లేదని అయితే పేద వాడు కుడా ఒక ఎమ్మెల్యే అయితే మరింత సేవ చేయటానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందే శ్యామ్, విప్పర్తి సుదర్శన్ కుమార్, మునిపల్లి మస్తాన్ రావు, పి. జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *