రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా పథకం కింద తొలి విడత లో 156 మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించి నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో డిఆర్డీఏ పిడి, డివిజన్ డెవలప్మెంట్ అధికారులతో కళ్యాణ మస్తు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 10 శుక్రవారం అమరావతి నుంచి వర్చువల్ విధానం లో వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా పథకం కింద లబ్దిదారుల ఖాతాకు నేరుగా నగదు బదలీ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. తొలి విడతలో జిల్లాకు చెందిన వైయస్ఆర్ కల్యాణ మస్తు కింద 156 మంది లబ్దిదారులను ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు స్క్రూ టిని చేసి అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి తో జరిగే కార్యక్రమంలో నేరుగా లబ్దిదారులతో వర్చువల్ ద్వారా ముఖాముఖి సంభాషించడం జరుగుతుందని తెలిపారు.
మండలాలు వారిగా లబ్దిదారుల జంటలు :
రంగంపేట -2, రాజానగరం 4,. గోకవరం 4 , నల్లజెర్ల 4, కోరుకొండ 4, తాళ్లపూడి 4, సీతానగరం 5, కొవ్వూరు అర్బన్ 5, బిక్కవోలు 5, అనపర్తి 6, కడియం 7, దేవరపల్లి 7, నిడదవోలు అర్బన్ 7, కొవ్వూరు 8, నిడదవోలు 8, రాజమహేంద్రవరం 9, గోపాలపురం 11, రాజమహేంద్రవరం అర్బన్ 13, చాగల్లు 14, ఉండ్రాజవరం 14, పెరవలి 15 చొప్పున లబ్దిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు. వైయస్ఆర్ కల్యాణ మస్తు, షాది తోఫా కింద ఎస్సీ, ఎస్టీ లకు లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ లు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.20 లక్షలు, బిసి లకు రూ.50 వేలు, బిసి లు కులాంతర వివాహం చేసుకుంటే రూ 75 వేలు, వికలాంగులకు రూ.1.50 లక్షలు, బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సభ్యులకు రూ.50 వేలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఎ పి డి ఎస్. సుభాషిణి, డి ఎల్ డి వో లు పి. వీణా దేవి, వి. శాంత మణి లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News