Breaking News

జాతీయ మానవ హక్కుల కమీషన్ సూచించిన పనులకు ప్రాధాన్యతనివ్వాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మానవ హక్కుల కమీషన్ నుండి అందిన త్రాగు నీటి, విద్యుత్, రోడ్స్, వంటి పనులకు అధికారులు ప్రాధాన్యత కల్పించి చేపట్టాలని, ఇప్పటికే చేపట్టిన పనుల వివరాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జాతీయ మానవ హక్కుల కమీషన్ కు నివేదించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. సోమవారం మద్యాహ్నం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలను చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమీషన్ నుండి గూడూరు, సూళ్ళూరుపేట రెవిన్యూ డివిజన్ల పరిధిలో రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే చేపట్టామని, త్రాగు నీటికి సంబంధించి 3 కి.మీ ల పైప్ లైన్ , ఫారెస్ట్ పరిధిలో 3 ఫేస్ ఎలక్ట్రిక్ లైన్ ఏర్పాటు, రెండు చెక్ డ్యామ్ ల నిర్మాణాలు, చెరువులలో పూడికతీత పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. జిల్లా కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో గూడూరు ఆర్.డి.ఓ. కిరణ్ కుమార్, సూళ్ళురుపేట ఆర్.డి.ఓ. చంద్రముని, షార్, సూళ్ళురుపేట డివిజన్ ఫారెస్ట్ అధికారులు, ఇరిగేషన్, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ అధికారులు, వాకాడు, డి.వి.సత్రం, తడ, సూళ్ళురుపేట, చిట్టమూరు తహశీల్దార్లు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *