Breaking News

వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 153 మంది దరఖాస్తు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు మంగళవారం డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 153 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ పత్రాలు లేనందున వారి దరఖాస్తులు రిజెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం 117 మందిని అర్హులుగా ప్రకటించగా వారిలో 57 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన వారి ఫోన్ కి మెసేజ్ వస్తుందని, ఎంపిక కాబడిన వార్డు వాలంటీర్లు ఈ నెల 6 నుండి విధుల్లోకి చేరవలసియుండునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *