Breaking News

కొండప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక దృష్టి పెట్టీ కొండప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ 22వ సచివాలయం, గంగిరెద్దుల దిబ్బ కొండ ప్రాంతంలో అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజల ముంగిటకు వెళుతుంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మా జీవితాల్లో వెలుగులు నిండాయని వారి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు స్వర్గీయ దేవినేని నెహ్రూ ని దేవుడిలా చూస్తారని ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి అండగా నిలబడ్డారు అని,నేడు మరలా అదే ప్రేమ నా మీద చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో అసలు ఈ కొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని, ఈ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లు కొండంచున ఉన్న ఇంటి వద్దకు కూడా వచ్చి పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని,అదేవిధంగా కోట్ల రూపాయలు వెచ్చించి నూతన మెట్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 5 వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు, వైసీపీ నాయుకులు వల్లెపు శ్రీను, కొండా, రాజా, నాగేశ్వర రావు, డివిజన్ నాయుకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *