Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల ప్రత్యేక అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల ప్రత్యేక అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తో కలిసి ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం, మండల అధికారులతో, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, సోమవారం ప్రజలనుంచి మొత్తం 130 ఫిర్యాదులు అందయన్నారు. వాటిలో ఆన్లైన్ లో 96 , ఆఫ్ లైన్ లో 34 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఏ ఒక్క ఆర్జి తిరిగి రాకుండా అధికారులు వ్యక్తిగత భాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు సమస్య పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

అర్జీల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల ప్రత్యేక అధికారులు వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం అన్నారు. గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ప్రతి రోజూ 3 నుంచి 5 గంటల వరకు ఆయా సచివాలయ కార్యదర్శులు తప్పని సరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చెయ్యడం జరిగిందన్నారు. మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా వారి పరిధిలోని సచివాలయాల తనిఖీలు నిర్వహించాలని అన్నారు. తిరిగి వస్తున్న ఆర్జీల పరిష్కార కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేసే బాధ్యత మండల ప్రత్యేక అధికారులది అని స్పష్టం చేశారు.

స్పందన కు వొచ్చిన అర్జి దారులకు మజ్జిగా పంపిణీ
సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ ప్రారంభించారు.  వేసవి దృష్ట్యా సోమవారం స్పందన కార్యక్రమానికి వొచ్చే ఆర్జి దారులకు మజ్జిగ పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా డివిజన్, మండల కేంద్రాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా తప్పనిసరిగా బయట తిరిగే సమయాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులు డి ఆర్వో జీ. నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *