Breaking News

సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఇకపై సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరు ను సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమి గా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత తరుణం లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లకు అకాడమి పేరులో ప్రాతినిధ్యం వుండే విధంగా సి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరును సి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ మీడియా అకాడమి గా మార్పు చేయాల్సిందిగా తాము కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించిందని సి.రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ మీడియా అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటన లో తెలిపారు. పేరును మార్చి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సముచిత ప్రాధాన్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి కి సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ కి, సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి కి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఆ ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *