Breaking News

అంబెడ్కర్ స్మృతి వనము పనులను ఆకస్మిక తనిఖీ చేసిన స్వప్న ల్ దినకర్ పుండ్క ర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాలతో స్పెషల్ సీ.ఎస్. వై శ్రీలక్ష్మి ఐఏఎస్ పర్యవేక్షణలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వపనిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ స్మృతి వనము పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లోని అంబెడ్కర్ స్మృతి వనము రాత్రి పూట జరిగే పని వివరాలను తెలుసుకుని వారికి కేటాయించిన పనులను ఉదయనికి పూర్తిచేయాలని కాంట్రాక్టలను ఆదేశించారు. తదుపరి కమిషనర్ బుధువారం ఉదయం క్షేత్ర స్థాయిలో అంబెడ్కర్ స్మృతి వనములో జరుగుతున్న పనులను పరిశీలించి మంగళవారం రాత్రి కేటాయించిన పనుల వివరాలు అడిగితెలుసుకొని రాత్రి కేటాయించిన పనులు జరగకపోవడం గమనించి కమిషనర్ కాంట్రాక్టలను హెచ్చరించి అధికారులకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *