గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ప్రకటన బోర్డ్ నగరపాలక సంస్థకు తగిన ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించని బోర్డ్ లను తొలగిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫీజులు చెల్లించని, అనదికార హోర్డింగ్లు, బోర్డ్ లను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రకటనల హోర్డింగ్స్ యజమానులు మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే సదరు బోర్డ్ లను తొలగించి, ఫీజుల వసూళ్లకు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. నగరంలో వార్డ్ సచివాలయాల వారిగా అనధికార బోర్డ్ ల తొలగింపుకు పట్టణ ప్రణాళిక అధికారులు ప్రత్యెక యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారన్నారు. ప్రకటనల బోర్డ్ ల నిర్వహకులు తప్పనిసరిగా బకాయిలతో పాటుగా ప్రస్తుత ఏడాది డిమాండ్ కూడా చెల్లించాలన్నారు.
Prajavartha Online Telugu News