విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ సీ.ఎస్. వై శ్రీలక్ష్మి ఐఏఎస్ పర్యవేక్షణలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వపనిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ స్మృతి వనము పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లోని అంబెడ్కర్ స్మృతి వనము రాత్రి పూట జరిగే పని వివరాలను తెలుసుకుని వారికి కేటాయించిన పనులను ఉదయనికి పూర్తిచేయాలని కాంట్రాక్టలను ఆదేశించారు. తదుపరి కమిషనర్ బుధువారం ఉదయం క్షేత్ర స్థాయిలో అంబెడ్కర్ స్మృతి వనములో జరుగుతున్న పనులను పరిశీలించి మంగళవారం రాత్రి కేటాయించిన పనుల వివరాలు అడిగితెలుసుకొని రాత్రి కేటాయించిన పనులు జరగకపోవడం గమనించి కమిషనర్ కాంట్రాక్టలను హెచ్చరించి అధికారులకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News