Breaking News

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల పరిశీలిన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 26వ తేదీ రాజమహేంద్రవరం విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం దివాన్ చెరువు సమీపంలోని జిబివి లే అవుట్ వద్ద హెలిపాడ్, రూట్ మ్యాప్ పాయింటింగ్ లను జిల్లా కలెక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్ , శాసనసభ్యులు జక్కంపూడి రాజాల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ స్థానికంగా నిర్వహిస్తున్న ప్రైవేటు కార్యక్రమానికి సిఎం హాజరు కానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్ల పై క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పరిశీలన చేసి, దిశా నిర్దేశం చేశామన్నారు. జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ లు ఆర్ అండ్ బీ, పంచాయతీ, పోలీస్ అధికారులకు ముందస్తు భద్రత ఏర్పాట్ల పై చర్చించడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమం లో కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆర్ అండ్ బి అధికారి ఎస్ బి వి రెడ్డి, డి ఈ బివివి మధుసూధన్, స్థానిక ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *