Breaking News

ఆడుదాం ఆంధ్రా స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసిన జాయింట్ క‌లెక్ట‌ర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ నెల 15 నుంచి నిర్వ‌హించ‌నున్న ఆడుదాం ఆంధ్రా క్రీడోత్స‌వాల‌కు సంబంధించి క్రీడా ప‌రిక‌రాల కిట్ల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్‌కుమార్ శ‌నివారం ఆయ‌న క్యాంపు కార్యాల‌యంలో వివిధ మండ‌లాల అధికారుల‌కు పంపిణీ చేశారు. క్రీడల దిశ‌గా యువతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలుచేసినట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ అధికారుల‌కు సూచించారు. మైదానాల‌ను సిద్ధంచేసి, క్రీడాకారుల రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ గ‌డువులోగా జ‌రిగేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని సచివాలయాలకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేయడం జరుగుతుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో చీఫ్ కోచ్ అజీజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *