Breaking News

ఓటర్ల జాబితా పరిష్కారం కోసం అత్యంత బాధ్యత వహించాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా పై వస్తున్న అభ్యంతరాలు, ఫిర్యాదుల నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం అత్యంత బాధ్యత వహించాలని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ ఆదేశించారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో ఎ.ఈ.అర్. ఓ లకు, సూపర్ వైజర్లకు మరియు బి.ఎల్ ఓ లుకు సమావేశం నిర్వహించి సబ్ కలెక్టర్ దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, ఎస్ ఎస్ ఆర్ 2024 ప్రకారం ఓటరు జాబితా తుది జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. కొవ్వూరు నియోజక వర్గ ఓటరు జాబితా కి చెంది ప్రస్తుతం వస్తున్న ఓటర్ల జాబితాల పై ప్రతికూల వార్తలను సంబంధిత అధికారులు, సిబ్బంది వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి ఆలసత్వం వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి బి ఎల్ వో పరిధిలో ఓటర్ జాబితాను మరో సారి సమగ్రంగా పరిశీలించి , తగు చర్యలు తీసుకోవాలని, సోమవారం కు అన్ని దరఖాస్తులు ను ప్రాసెస్ పూర్తి చెయ్యాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *