Breaking News

అటవీ హక్కుల చట్టంతో గిరిజనులకు లబ్ది…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం కల్పించిన అటవీ హక్కుల చట్టానికి చట్టబద్దత కల్పించి పట్టాలు మంజూరు చేయడం ద్వారా శాశ్వత లబ్ది చేకూరుస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. అటవీ హక్కుల చట్ట నిబంధనలను పరిశీలించి అర్హులైన గిరిజన లబ్దిదారులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం సాగు చేసుకుంటున్న అటవీ భూమిపై శాశ్వత హక్కు కల్పించడంలో భాగంగా ఎనిమిది మంది గిరిజనులకు 11.44 ఎకరాలకు భూమికి మంజూరైన పట్టాలను గురువారం జిల్లా కలెక్టర్‌ ఢల్లీి రావు నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామానికి చెందిన 8 మంది లంబాడా తెగ గిరిజనులు గత 20 సంవత్సరాలుగా 11.44 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట సాగు చేసుకుంటున్నామని ఆ భూములకు సంబంధించి రికగ్నైషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) కింద పట్టాలు మంజూరు చేయాలని అప్పీల్‌ చేసుకోవడం జరిగిందన్నారు. లబ్దిదారుల విన్నపాన్ని పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ, ఉద్యాన, రెవెన్యూ, అటవీ శాఖల కు చెందిన సబ్‌ డివిజనల్‌ లెవల్‌ కమిటీ ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్ట ప్రకారం మార్గదర్శకాలను పరిశీలించి లబ్దిదారులకు భూ హక్కు పత్రాలను మంజూరు చేయాలని ఆమోదం తెలిపిందన్నారు. లబ్దిదారులలో దారావత్‌రాణి 1.73 ఎకరాలు, బారోతు లక్ష్మి 0.61 ఎకరాలు, బారోతు కృష్ణ 0.02 ఎకరాలు, అజ్మీరా జమ్కా 1.90 ఎకరాలు, బారోతు శ్రీను 2.01 ఎకరాలు, బారోతు టీకు 1.66 ఎకరాలు, బారోతు శ్రీరాములు 0.33 ఎకరాలు, అజ్మీరా గల్లు 2.88 ఎకరాలు సాగు చేసుకుంటున్నారని గుర్తించి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం 2005 ప్రకారం ఆయా లబ్దిదారులకు పట్టాలు మంజూరు చేసి లబ్దిదారులకు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్‌ తెగల సంక్షేమం మరియు సాధికారిత ఇన్‌చార్జ్‌ అధికారిణి జె. సునీత, లబ్దిదారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *