-ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి
-పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగు, అత్యవసర సేవలు నిర్వహించే ఓటింగు తేదీలను తెలియ చేస్తాం
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత , ఎన్నికల సాధారణ పరిశీలకులు బాల సుబ్రహ్మణ్యం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని , ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిని అనుసరించి చేపట్టే కార్యక్రమాలను ముందస్తూగా రాజకీయ పార్టీల సమాచారం ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ , తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీ లత, పార్లమెంట్ జనరల్ సుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యయపరిశీలకులు, జాయింట్ కలెక్టర్ తేజభరత్, ఎన్నికల పరిశీలకులు సమక్షంలో రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికల విధి విధానాలపై వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్/ డి ఈ ఓ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల పోటీలో నిలిచే అభ్యర్థులు ఖరారు అవ్వడం జరిగిందనీ , తదుపరి ప్రక్రియ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఏప్రియల్ 25 వరకూ ఉన్న ఓటర్ల సంఖ్య పై జాబితా ప్రకటించడం జరిగిందనీ, వాటినీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఒక ప్రతి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, మిగిలిన అభ్యర్థులకు చెల్లింపు ఆధారంగా ఓటర్ల జాబితా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందన్నారు. ఆయా పార్టీ అభ్యర్ధులు చేసే ఎన్నికల ప్రచార ఖర్చులను పార్టీల ఖాతాలకు చూపడం జరిగిందన్నారు. ఏప్రియల్ 18 నుంచి అభ్యర్ధులు నామినేషన్ వేసిన నాటి నుంచి ఖర్చులను ఆయా అభ్యర్థుల ఖాతాలకు చూపడం జరుగుతుందని తెలియ చేశారు. అభ్యర్ధుల ఖర్చుల పై జిల్లాలో ఫ్లయింగ్ స్కాడ్ టీములు పర్యవేక్షణ చేస్తుంటాయని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ప్రచారం లో చెసే ఖర్చులను షాడో బృందాలు, ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయడం సంబందిత అభ్యర్ధి ప్రచార ఖర్చులో వాటిని లెక్కించడం జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమనిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పార్టీల అభ్యర్ధులు నడుచుకోవాలన్నారు. పార్టీలు అభ్యర్థులు ముందస్తుగా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకుని సమావేశాలు, ర్యాలీలు తీసుకుని నిర్వహించాలన్నారు. కరపత్రాల, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ముద్రించినట్లు ప్రింటర్, ప్రచురణ కర్తలు ఎన్నికల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు.
తుది ఎన్నికల జాబితా ఈరోజు అందచేసేవి, పొలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులొ ఉంచడం జరుగుతుందని పార్లమెంటు సాధారణ పరిశీలకులు కే. సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుగుణంగా అభ్యర్ధులు ప్రవర్తించాలని కోరారు. పోటీలో నిలిచే అభ్యర్థులు ఖచ్చితంగా కొన్ని హక్కులు ఉంటాయని, అదే విధంగా ఎన్నికల యంత్రాంగం కూడా కొన్ని హక్కులు, అధికారులూ కలిగి ఉంటాయని బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి ఒక్క ఓటరుకు ఓటరు ఇన్ఫర్మేషన్ స్లీప్ ఇవ్వడం జరుగుతుందని, అదే కేవలం సమాచారం కోసం మాత్రమే అని, ఓటరు గుర్తింపు కార్డు, లేదా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఇతర ఫోటో గుర్తింపు ద్వారా మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. మాక్ పొలింగ్ ఉదయం 5 గంటలకి సమయానికి ముందుగా ఆయా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ ఏజెంట్స్ చేరుకోవాలని, ప్రతి పొలింగ్ కేంద్రంలో 50, ఓట్లు పోల్ చేస్తారని తెలిపారు.
రూరల్ నియోజక వర్గం లో పోటీలో నిలిచే అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్, రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు. అభ్యర్థులకు, పొలింగ్ ఏజెంట్స్ కు గుర్తింపు కార్డులు, ఇతర సమాచారం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ తాత్కాలిక కార్యాలయం, ప్రచార వాహనాలు, రూట్ మ్యాప్ అనుగుణంగా అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.
పార్లమెంటు నియోజక ఎన్నికల వ్యయ వర్గ పరిశీలకుల జై అరవింద్, అసెంబ్లి నియోజక వర్గ రోహిత్ నగర్ లు మాట్లాడుతూ, అభ్యర్ధులు నామినేషన్ వేసిన నాటి నుంచి ఖర్చులు, వివిధ అనుమతులకు సంబందిత మార్గదర్శకాలు మేరకు సువిధా అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. సింగిల్ విండో విధానం లో అనుమతులు ఇస్తున్నట్లు తెలియ చేశారు. ప్రతి ఖర్చు రికార్డు చేయడం జరుగుతోందని తెలిపారు. ఆయా ఖర్చులను సంబంధిత ఆధారాలతో కూడి మే 2 , 6 , 10 తేదీల్లో ఖర్చులను ఆడిటింగ్ కోసం హాజరు కావాలని కోరారు.
సమావేశంలో డిఆర్ఓ జి. జి నరసింహులు రాజమండ్రి పార్లమెంటు, రాజమండ్రి రూరల్ పోటీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News