Breaking News

మే13 న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి…

-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
మే13 న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం అందరూ రిటర్నింగ్ అధికారులు, ఎఆర్ఓ లతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ మే13 న జరిగే సార్వత్రిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని సూచించారు. అలాగే బడ్జెట్ అంశాలపై సమీక్షిస్తూ శని వారం మరియు ఆదివారం సెలవు దినాలు కావున పోలింగ్ నిర్వహణ కొరకు బిల్స్ అప్లోడ్ మరియు డిసి బిల్లులు ముందుగానే బ్యాంకు నుండి డ్రా చేసి భద్రపరచుకోవాలి అని, టి.ఏ, డి.ఏ ను పి. ఓ, పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్, తదితర వాటికి ఇవ్వాల్సిన ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండరాదని తెలిపారు.

ఈ టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, రిటర్నింగ్ అధికారులు తదితర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *