-సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించడానికి మోనటరింగ్ వ్యవస్థ పటిష్టం కావాలని, సక్రమమైన కార్యాచరణ ప్రణాళిక వేయాలని సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీ ప్రాంగణం ఎస్ జె సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లో జరుగుతున్న అభ్యసనా అభివృద్ధి కార్యక్రమం (ఎల్ఐపి) వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో సామర్థ్యాల సాధనకు, ఉపాధ్యాయులకు బోధనా మెళుకువలు, సాధన కృత్యాలు, బోధనా సోపానాలు వంటి అంశాల అభివృద్ధి కోసం 2022- 23 విద్యా సంవత్సరం నుండి పది జిల్లాలలో ఈ అభ్యసనా అభివృద్ధి కార్యక్రమం (ఎల్ఐపి) అమలవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం (2024 – 25) నుండి మిగతా జిల్లాల్లో కూడా విజయవంతంగా కార్యక్రమం అమలు చేయడానికి ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. కార్యశాలలో వల్లి మాణిక్యం (సిప్స్ డైరెక్టర్), ఎన్ ఉపేందర్ రెడ్డి (అడ్వైజర్ సిప్స్, అస్కి), ఎం. శ్రీనగేష్ (సేవ్ ది చిల్డ్రన్ ఎడ్యుకేషన్, దక్షిణ భారత ఇంచార్జ్), రాష్ట్రస్థాయి విషయ నిపుణుల బృందం పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News