Breaking News

ఓట్ల లెక్కింపుకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషనర్‌ నిబంధనలు పాటిస్తూ జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డిల్లీరావు ప్రధాన ఎన్నికల కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు వివరించారు.
అన్ని రాష్ట్రాల సిఇవోలు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఢల్లీి నుండి ఎలక్షన్‌ కమీషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, డా. సుఖ్బీర్‌ సింగ్‌ సందు తో కలసి ఎన్నికల కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపుకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.
నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌లు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల కమీషన్‌ నిబంధనలను పాటిస్తూ చేస్తున్న ఏర్పాట్లను ప్రధాన ఎన్నికల కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *