గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 59,403 మంది పెన్షనర్లకు జూలై 1న ఉదయం 6 గంటల నుండే వారి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని 206 వార్డ్ సచివాలయాల పరిధిలో 1632 మంది సచివాలయ కార్యదర్శుల ద్వారా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో జూలై 1 వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దనే అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని తెలిపారు. నగరంలోని 206 వార్డ్ సచివాలయాల పరిధిలో 59,403 మంది పెన్షనర్లకు రూ.40,87,60,000లను వారి ఇంటి వద్దనే 1632 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా అందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. పెన్షన్ ల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణకు 42 మంది నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. పెన్షన్ల పంపిణీ విధులు కేటాయించబడిన కార్యదర్శులు జూలై 1వ తేదీకి ముందే తమకు కేటాయించిన ప్రాంతం, పెన్షనర్ల సంఖ్య(కేటగిరి వారిగా), పంపిణీ చేయాల్సిన నగదు తదితర అంశాలను నోడల్ అధికారి ద్వారా తెలుసుకోవాలని ఆదేశించామన్నారు. పెన్షన్ పంపిణీ ఉదయం 6 గంటల నుండే ప్రారంభించాలని, ప్రతి గంటకు పంపిణీ శాతం జిఎంసికి తెలియచేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శుల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Prajavartha Online Telugu News