Breaking News

ఎస్టీ, ఎస్సి విద్యార్థుల కి డి ఎస్సీ ఉచిత శిక్షణ

-నేటితో నమోదుకు గడుపు పూర్తి
-కె.ఎస్ జ్యోతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతిభావంతులైన పేద గిరిజన షెడ్యూల్ కులాల విద్యార్థులకు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధ్వర్యంలో డి ఎస్సి లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన పేద షెడ్యూల్ కులాల, జాతులకు చెందిన విద్యార్థులకు డీఎస్సీ లో ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు .

ఎస్టీ ఎస్సి విద్యార్థుల కి రెసిడెన్షియల్ ప్రాతిపదికన శిక్షణ ఇవ్వనునట్లు టెట్ లో ఉత్తీర్ణులై ఉంటే వారికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి ఆ టెస్టులో 85 % , టెట్ నందు పొందిన మార్కులులో 15 % వెయటేజిని ఇవ్వనున్నట్లు జ్యోతి తెలిపారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగు తుందన్నారు. ఆసక్తీ గల అభ్యర్థులు వారీ పేర్లు నమోదు చేసుకోనుటకు అక్టోబరు 25 శుక్రవారం చివరి తేది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శిక్షణ ఎంపిక కు అన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నవంబరు 3 వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *