Breaking News

Daily Archives: March 16, 2025

సోమవారం మార్చి 17 న కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు …

Read More »

కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం కలెక్టరేట్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం నిరాహార దీక్ష చేపట్టి, ఆంధ్ర రాష్ట్రo ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన గొప్పవ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. 1901 మార్చి 16 న పడమటిపల్లి, నెల్లూరు జిల్లాలో జన్మించారు. …

Read More »

డీకే బాలాజీ 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఐఏఎస్ అధికారిగా ఉంటూ డీకే బాలాజీ 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయమని ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం విభాగం యోగా గురువులు గురునాథ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డికె బాలాజీ, ఐఎఎస్, రధసప్తమి సందర్భంగా గత ఫిబ్రవరి నెల 2 వ తేదీన కృష్ణాజిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ లో 150 మంది యోగా సభ్యులతో కలిసి 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసారు. 108 రౌండ్ల …

Read More »

ఈ నెల 17వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …

Read More »

పదవ తరగతి పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నుండి జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు, క్షేత్రాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి 145 కేంద్రాలలో …

Read More »

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహనీయులన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద …

Read More »

అమరజీ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడని, ఆయన త్యాగం మరువలేనిదని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నగరంలోని జిల్లా కోర్టు సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి, ఇతర కూటమి నాయకులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …

Read More »

మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో మచిలీపట్నం మున్సిపల్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పున ప్రారంభి పూర్తి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆయన నగర కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో పాత రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మాణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1864లో మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పాటయిందన్నారు. తర్వాత మచిలీపట్నం నగర కార్పొరేషన్ …

Read More »

మచిలీపట్నం నగర అభివృద్దే లక్ష్యం

-రూ. 14.48 లక్షల విలువైన సిఎస్ఆర్ నిధులతో నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నం నగరంలోని 19వ డివిజన్లో రూ.14.48 లక్షల విలువైన సిఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ డివిజన్లో రూ.5.70 …

Read More »

తెలుగువారి ఆత్మగౌరవానికి పొట్టి శ్రీరాములు చిహ్నం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకోసం ప్రాణత్యాగానికి వెనుకాడని పొట్టి శ్రీరాములు జీవితం నేటి తరానికి ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా హిందూ కాలేజీ జంక్షన్ లోని ఆయన విగ్రహానికి నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా …

Read More »