Breaking News

Daily Archives: March 21, 2025

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది

-ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర వలందపాలెం/మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నగరం 3వ డివిజన్ వలందపాలెంలోని జామియా మసీదులో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. స్థానిక ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు …

Read More »

గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభిస్తామని గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి మచిలీపట్నం మండలంలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. తొలుత వారు గిలకలదిండిలోని మత్స్యశాఖ షోరు కమ్యూనికేషన్ స్టేషనులో ఫిషింగ్ హార్బర్ రేఖ చిత్రపటాన్ని, తదుపరి నిర్మాణంలో ఉన్న ఫిష్ హ్యాండ్లింగ్, ఆక్షన్ …

Read More »

భారతీయ సైన్యంలో చేరండి – అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025-26

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డి. కే. బాలాజీ తెలిపారు, భారతీయ సైన్యం అగ్నిపథ్ స్కీమ్ కింద 2025-26 రిక్రూట్మెంట్ సంవత్సరానికి సంబంధించి కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (CEE) కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పరవతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, NTR …

Read More »

బందరు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకారం అందించాలని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. బందరు స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం నగర పరిధిలోని పాత రైల్వే స్టేషన్ నుంచి బందరుకోటకి వెళ్లే రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఇతర కూటమి నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా …

Read More »

దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వారు సురక్షిత తీరం- సమృద్ధి భారత్ లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో (సిఐఎస్ఎఫ్) సముద్ర తీర సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్ అదనపు పోలీసు అధికారి సత్యనారాయణ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు. అంతకుమునుపు ర్యాలీలో పాల్గొన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని …

Read More »

బెంజిసర్కిల్‌లో చలివేంద్రం ప్రారంభం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ తరుణ్ కాకాని బెంజిసర్కిల్‌లో చలివేంద్రం ఏర్పాటుచేశారు. శుక్రవారం బెంజిసర్కిల్‌లోని ఉమ్మడి  ఏపీ మాజీ కేబినెట్ మంత్రి మరియు జై ఆంధ్ర ఉద్యమ వ్యవస్థాపకుడు దివంగత నేత  కాకాని వెంకటరత్నం విగ్రహానికి పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత కెఏఎస్ఎస్ కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ తరుణ్ కాకాని, బిజెపి  నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా …

Read More »

పన్ను చెల్లించుటకు 6 క్యాష్ కౌంటర్లను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సౌకర్యార్థం వివిధ రకాల పన్నులు చెల్లించుటకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లలో ఆరు క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారంనాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మూడు సర్కిల్ కార్యాలయాలలో గల ఆరు క్యాష్ కౌంటర్లలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 …

Read More »

డి మార్ట్ లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శుక్రవారం ఉదయం సాంబమూర్తి రోడ్లో ఉన్న D-Mart ని ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా …

Read More »

ప్రజల క్షేమం, నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యం- నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల క్షేమం, నగరాభివృద్ధే లక్ష్యం అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో 2024 -25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ముఖ్యాంశాలను వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 40.9 కోట్లు తో 47.46కి సీసీ రోడ్లను, బీటీ రోడ్లు 6.80 కోట్ల రూపాయలుతో 4.33 కి మీ వేశారని, 15 ఫైనాన్స్ కమీషన్ లో గాలి నాణ్యతని మెరుగుపరచడం కోసం 24.91 …

Read More »